యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
శ్రీకాకుళం నుంచి ప్రజా అంకిత యాత్ర ప్రారంభం
శ్రీకాకుళం, గురువారం, 9 అక్టోబర్ 2008   ( 18:17 IST )
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మెగా యాత్ర శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల యాత్రకు గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూజలు జరిపిన తర్వాత అక్కడే చిరంజీవి తన ప్రజా అంకిత యాత్రను ప్రారంభించారు.

హైదరాబాద్‌నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన 4.45 గంటలకు శ్రీకాకుళం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అరసవల్లికి కారులో వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 11వరకు ప్రచారం జరుపనున్న ఆయన తొలి విడతలో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా యాత్రను చేపట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

చిరంజీవి యాత్రను పురస్కరించుకుని దాదాపు 600మందితో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ,. పోలీసులు కూడా తమ వంతు భద్రతా విధులను నిర్వహిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు తాడి వెంకట్రావు, పెద్దింటి జగన్మోహన్ రావు, విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావుల సమక్షంలో చిరంజీవి పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్దతు: బాబు
శ్రీకాకుళం నుంచి మెగా యాత్రకు సర్వం సిద్ధం
ముగింపు దశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
మధ్యంతర భృతిపై సర్కారుతో జేఎసీ చర్చలు సఫలం
రేణిగుంట ఎయిర్‌పోర్టు హోదా పెంపుకు ఓకే
రాష్ట్రంలో 5.75కోట్ల ఓటర్లు: సీఈవో సుబ్బారావు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...