యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్దతు: బాబు
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008   ( 15:16 IST )
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు టీడీపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానంతరం హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే రీతిలో ఈ అంశంపై తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.

ప్రత్యేక తెలంగాణపై ఏర్పాటు చేసిన కోర్ కమిటీ రాయలసీమ, కోస్తా, తెలంగాణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం సమర్పించిన నివేదికపై పొలిట్‌బ్యూరో నాలుగురోజుల పాటు విస్తృతంగా చర్చించిందని తెలిపారు.

రాష్ట్రంలో వేర్పాటువాదం బలోపేతం కావడానికి కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు రాజకీయ మనుగడకోసం ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలను ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు.

ప్రత్యేక తెలంగాణను ఇస్తామని చెప్పి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలను నమ్మించి, తెరాసతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తన నాలుగున్నరేళ్ల పాలనలో దీనికోసం ఏమీ చేయక తెలంగాణ ప్రజలను చెత్తబుట్టలో పడేసిందని ధ్వజమెత్తారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీకాకుళం నుంచి మెగా యాత్రకు సర్వం సిద్ధం
ముగింపు దశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
మధ్యంతర భృతిపై సర్కారుతో జేఎసీ చర్చలు సఫలం
రేణిగుంట ఎయిర్‌పోర్టు హోదా పెంపుకు ఓకే
రాష్ట్రంలో 5.75కోట్ల ఓటర్లు: సీఈవో సుబ్బారావు
ప్రధాని దృష్టికి వరి మద్దతు ధర: వైఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...