యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
శ్రీకాకుళం నుంచి మెగా యాత్రకు సర్వం సిద్ధం
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మెగా యాత్రకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల యాత్రకు ఆయన గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం హైదరాబాద్‌నుంచి విశాఖ మీదుగా అరసవల్లి దేవాలయానికి చేరుకోనున్న చిరంజీవి సూర్యనారాయణుడికి పూజలు జరిపిన తర్వాత యాత్రను ప్రారంభించనున్నారు.

శ్రీకాకుళంతో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా తొలి విడత యాత్రను చేపట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండేసి రోజుల పాటు, విశాఖ జిల్లాలో ఐదు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు తాడి వెంకట్రావు, పెద్దింటి జగన్మోహన్ రావు, విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావుల సమక్షంలో చిరంజీవి పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముగింపు దశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
మధ్యంతర భృతిపై సర్కారుతో జేఎసీ చర్చలు సఫలం
రేణిగుంట ఎయిర్‌పోర్టు హోదా పెంపుకు ఓకే
రాష్ట్రంలో 5.75కోట్ల ఓటర్లు: సీఈవో సుబ్బారావు
ప్రధాని దృష్టికి వరి మద్దతు ధర: వైఎస్
రాజకీయాల్లోకి జగన్: వివేకానందరెడ్డి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...