|
| ఖమ్మం జిల్లాకు సాగర్ సాగునీరు |
| ఖమ్మం, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 17:39 IST ) | |
ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుకు సాగునీటిని త్వరలో విడుదల చేస్తున్నారు. సత్తుపల్లి శాసనసభ్యుడు జలగం వెంకట్రావు సాగర్ నీటిని విడుదల చేయాలంటూ సీఎం వైస్‌ను కోరారు. దీనిపై వైఎస్ సానుకూలంగా స్పందించి నీటిని త్వరలో విడుదల చేయమని అధికారులను ఆదేశించారు. సాగర్ ఆయకట్టు కింద రెండో జోన్ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెంకట్రావు చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నుంచి నీరు విడుదల గురువారం చేస్తున్నారు. జిల్లాలో 2.53 లక్షల ఎకరాలు సాగర్ ఆయకట్ట కింద ఉంది. ఇందులో 1.26 లక్షల ఎకరాలు మాగాణి కాగా, 1.27 లక్షల ఎకరాల మెట్ట భూమి ఉంది. సాగర్ ఆయకట్టు పరిధి కిందకు జిల్లాలో 16 మండలాల సాగు భూమి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు మొదలయ్యాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|