యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సీఎంను కలిసిన వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ
హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 16:28 IST )
వరంగల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సీఎం రాజశేఖర రెడ్డితో చర్చించటానికి ఆ నగర మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మంగళవారం కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి సమావేశం పావుగంటసేపు జరిగింది. వరంగల్ నగరపాలకసంస్థలో చేపట్టిన అభివృద్ధి పనులు గురించి వీరివురూ చర్చించారు. కొన్ని పథకాల అమలుకోసం ప్రభుత్వం సాయం అందించాలని సీఎంను మేయర్ స్వర్ణ విజ్ఞప్తి చేశారు.

వరంగల్ నగరపాలకసంస్థలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను స్వర్ణ వివరించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు తిరుగుబాటుకు గల కారణాలను వైఎస్‌కు తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లలో అందరూ అసంతృప్తితో లేరని స్పష్టం చేశారు. కొంతమంది కావాలని చేస్తున్న పని చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు చొరవ తీసుకుంటే ఈ సమస్య కొలిక్కి వస్తుందని సీఎంకు స్వర్ణ తెలియజేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సాగునీటి ప్రాజెక్టులు ఇకపై పర్యాటక కేంద్రాలు
ముత్యాలపాలెం రేవు అభివృద్ధికి నో: ప్రభుత్వం
ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై రాజ్‌నాథ్ సింగ్ ఆరా!
చర్చకు ససేమిరా: సభ రేపటికి వాయిదా
నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్యే కరణం బలరాం
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...