|
| ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై రాజ్‌నాథ్ సింగ్ ఆరా! |
| న్యూఢిల్లీ, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 12:50 IST ) | |
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయను దీనికి సంబంధించిన సమాచారం సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో చిరు పార్టీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుని కేంద్రంలో అధికారం చేపట్టడం తేలిక అవుతుందని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భాజపా-తెలుగుదేశం పార్టీలు గతంలో కలిసి పనిచేసి 1999లో కేంద్రంలో అధికారం చేపట్టింది. ఆ సమయంలో భాజపా ఐదు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంది. 2004లో జరిగిన ఎన్నికల్లో భాజపా ఒంటరిగా బరిలోకి దిగి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సీట్ల సంఖ్య పరంగా కేంద్రంలో అధికారం చేపట్టటానికి ఏపీ కీలకమని భాజపా భావిస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|