|
| నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్యే కరణం బలరాం |
| తిరుపతి, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 12:04 IST ) | |
హైదరాబాద్‌లో శాసనసభ వద్ద అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నిరాహార దీక్షకు దిగారు. సభాపతి సురేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సభ నుంచి బలరాంను ఆరునెలలపాటు సస్పెండ్ చేశారు. కరణం బలరాం నిరాహార దీక్షకు తెరాస శాసనసభ్యులు మద్దతుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తాను విమర్శిస్తున్నానని కక్షగట్టిన ఆ పార్టీ సీనియర్ నేతలు శాసనసభకు తాను రాకుండా సస్పెండ్ చేశారని బలరాం ఆరోపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆర్థిక మంత్రి రోశయ్య, ఛీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి, కమిటీ ఛైర్మన్ గాదె వెంకట రెడ్డి, ప్రకాశం జిల్లా నేతలు కలిసి తనను సభకు రాకుండా సస్పెండ్ చేయాలని స్పీకర్ సురేష్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారని బలరాం వివరించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|