|
| నవ తెలంగాణ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు |
| హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 11:01 IST ) | |
హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో బుధవారం మధ్యాహ్నం జరిగే నవ తెలంగాణ ప్రజా పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు దేవేందర్ గౌడ్ తన సత్తా ఏమిటో అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నారు. నవ తెలంగాణ పార్టీ విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను దేవేందర్ గౌడ్ ఈ సందర్భంగా ప్రకటిస్తారు.
దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకోసం పోరాడుతున్న నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఇందులో ఉత్తర ప్రదేశ్‌లో బుందేల్‌ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖా, అసోంలో బోడోలాండ్, మహారాష్ట్రలో విదర్భ, పూర్వాంచల్ ప్రాంతాల ఏర్పాటుకోసం పోరాడే నేతలు ఈ సదస్సుకు వస్తున్నారు. తెలంగాణ నుంచి ఒక లక్ష మందిని ఈ సభకు తరలిస్తున్నారని తెలిసింది.
నవ తెలంగాణ ప్రజా పార్టీ ప్రకటించిన 45 రోజుల తర్వాత ఆవిర్భావ సభను దేవేందర్ గౌడ్ నిర్వహిస్తున్నారు. నవ తెలంగాణ పార్టీ జులై 11న తేదీన ఆవిర్భవించింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగే భారీ బహిరంగ సభ తర్వాత సెప్టెంబరు 4వ తేదీన దేవేందర్ గౌడ్ బస్సు యాత్రను మొదలుపెడతారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|