|
| ఆత్మ గౌరవం కోసం పాటుపడ్డాం: చంద్రబాబు నాయుడు |
| హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 10:27 IST ) | |
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తాము పాటుపడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి అది సాధిస్తాం ఇది సాధిస్తాం అని గొప్పులు చెప్పుకుంటున్న ఇతర రాజకీయ పక్షాల గురించి చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్థి చెందిందని వివరించారు.
శాసనసభలో మద్యనిషేధంపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. మధ్యనిషేధం అమలుచేసి మహిళలకు కష్టాలను దూరం చేశామని తెలిపారు. ఈ సాహసం ఏ ప్రభుత్వం చేయలేదని వివరించారు. కిలో రెండు రూపాయలు బియ్యం పథకంవల్ల పేదలు లబ్ధి పొందారని చెప్పారు.
కాంగ్రెస్ శాసనసభ్యులు పదవులకు రాజీనామాచేసి ఎన్నికల బరిలోకి దిగండని సవాలు విసిరారు. ప్రజల మద్దతు ఎవరికుందో తేలుతుందని హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు, ఆర్థిక మంత్రి రోశయ్య ఎన్నికల్లో పోటీచేస్తే ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. అందుకే శాసనమండలి సభ్యుడుగా కొనసాగుతానని వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలంగులకు 60 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. వికలాంగులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అలాగే స్వయం ఉపాథి పథకాల ద్వారా వీరికి ప్రభుత్వమే రుణాలు ఇస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|