|
| అధికారమే పరమావధిగా చిరంజీవి రంగప్రవేశం: జేసీ |
| హైదరాబాద్, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 18:50 IST ) | |
అధికారమే పరమావధిగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రముఖల పేర్లు ప్రస్తావించి వాళ్లు తనకు స్ఫూర్తి అని చిరంజీవి అనటాన్ని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అవసరమైన సేవను అందిస్తుందని తెలిపారు.
కొత్త వాళ్లు రాజకీయ పార్టీలు పెట్టినా ప్రజలు వారివైపు మొగ్గుచూపే పరిస్థితి పోయిందన్నారు. దీనిని వారు గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సినీ ప్రముఖులకు ప్రజలు పట్టంకడతారని వారు పగటి కలలు కనటం మానాలని హితవు పలికారు. చిరంజీవి పార్టీ పెట్టి రంగంలోకి దిగినా కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడక అని జేసీ వివరించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|