|
| బీజేపీతో పొత్తుకు చిరంజీవి పార్టీ, తెరాస ఆసక్తి |
| న్యూఢిల్లీ, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 15:17 IST ) | |
ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి ఏర్పాటుచేయబోయే పార్టీతోపాటు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లు తమతో పొత్తు కోసం ఆసక్తి కనబరుస్తున్నాయని భాజపా తెలిపింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఇది తార్కాణమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ప్రతినిధి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు. దీనిపై ఆ పార్టీలు తమతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. ఎన్నికలు సమయానికి పొత్తు ఖరారు అవుతుందన్నారు.
ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం వ్యవహారశైలితో ప్రజలు విసిగిపోయారు. లోక్‌సభలో సీట్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమని తెలిపారు. ఏపీలో మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లను తాము లేదా తమ కొత్త కూటమి కైవసం చేసుకుంటే కేంద్రంలో భాజపా కూటమి అధికారంలోకి రావడం తేలిక అవుతుందని అభిప్రాయపడ్డారు. భాజపా 1999లో తెలుగుదేశంతో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన సంగతిని జావడేకర్ గుర్తుచేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|