|
| భాజపా అగ్రనేత అద్వానీతో చర్చలు జరిపిన చిరంజీవి |
| హైదరాబాద్, 19 ఆగస్టు 2008 ( 13:23 IST ) | |
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ప్రధానమంత్రి అభ్యర్ధి ఎల్‌కే అద్వానీతో చిరంజీవి మంగళవారం ఫోన్‌లో మంతనాలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అద్వానీతో జరిపిన తాజా మంతనాలకు ప్రాధాన్యత చేకూరింది. రాజకీయ రంగ ప్రవేశంపై చిరంజీవి ఫోన్‌లో అద్వానీ ఆశీర్వాదం పొందినట్టు తెలిసింది.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పేరును, విధివిధానాలను ఆగస్టు 26న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో ప్రకటించనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పార్టీ కోసం రాష్ట్రంలో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తిరుపతిలో జరిగే బహిరంగ సభకు సంబంధించిన పనులు మరోవైపు చురుగ్గా సాగుతున్నాయి.
నర్సాపురం మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మంగళవారం చిరు పార్టీలో చేరారు. చిరు పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన జోగయ్య అనుభవాన్ని తాము పూర్తిగా వినియోగించుకుంటామని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|