|
| కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ |
| విజయవాడ, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 12:42 IST ) | |
జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించాలనే లక్ష్యంతో టెలికాం శాఖ పనిచేస్తుందని బీఎస్ఎన్ఎల్ విజయవాడ జనరల్ మేనేజర్ జాన్ క్రిస్తోస్తమ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంతానికి జిల్లాలో 1.5లక్షల మొబైల్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మండల కేంద్రమైన చాట్రాయిలో నిర్మించిన సెల్ వన్ టవర్‌ను మేనేజర్ జాన్ సోమవారం ప్రారంభించారు.
చాట్రాయి సెల్ వన్ టవర్‌ను రూ.45 లక్షలతో ఏర్పాటుచేశామని వివరించారు. జిల్లాలో మొత్తం 199 టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు ఉండగా, అందులో 142 ఎక్స్ఛేంజ్‌ల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు నెలకు రూ. 250లు చెల్లించి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను నిరంతరాయంగా పొందవచ్చునని చెప్పారు.
జిల్లాలో పుట్రేల, రెడ్డిగూడెంలలో సెల్ వన్ టవర్ల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తవుతుందని వివరించారు. తుమ్ముగూడెంలో టవరు నిర్మాణం ప్రస్తుతం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎన్ఎల్ అధికారులు వచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|