యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
వంశధార నది ఎడమ కాల్వకు గండి
శ్రీకాకుళం, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 12:07 IST )
శ్రీకాకుళం జిల్లాలో ప్రవహించే వంశధార నది ఎడమ కాల్వకు సోమవారం గండిపడటంతో పంటపొలాలు ముంపుబారిన పడ్డాయి. వేలాది ఎకరాల్లో వివిధ పంటలు నీటమునిగాయి. అనంతగిరి-లివిరి గ్రామాల మధ్య కాల్వకు గండిపడింది. కాల్వ నీరు పరిసర గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టెక్కలి మండలం గుండా వంశధార ఎడమ కాల్వ ప్రవహిస్తుంది.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల వంశధార నది ఎడమ గట్టు చిత్తడిగా మారింది. భారీ నీటిపారుదల శాఖ అధికారులు కాల్వ మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ఈ గండి ఏర్పడింది. కాల్వకు ఎటువంటి మరమ్మత్తులు చేయకుండానే నీటిని విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నుంచి మరలా భారీ వర్షాలు పడుతున్నాయి.

వంశధార వరద కాల్వల నిర్వహణ, మరమ్మత్తుల విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వ గండ్లవల్ల రైతులు గత రెండేళ్లుగా పంటలు కోల్పోయి ఆర్థిక నష్టాల పాలవుతున్నారు. కాల్వ గండి కారణంగా దాదాపు 20వేల ఎకరాల్లో ఇసుకమేటలు వేసి రైతులకు కడగండ్లు మిగిల్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చిరంజీవిలో సేవాభావం: గాయకుడు బాలు
కొత్త పార్టీలు ఏమీ చేయలేవు: నటుడు రాజశేఖర్
తెలంగాణా వనరులను కొల్లగొడుతున్న కాంగ్రెస్
సీఎంచే వెలిగొండ సొరంగం పనులు నేడు ప్రారంభం
విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడు
నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...