యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తెలంగాణా వనరులను కొల్లగొడుతున్న కాంగ్రెస్
హైదరాబాద్, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 10:41 IST )
తెలంగాణా వనరులను కాంగ్రెస్ కొల్లగొడుతున్నదని నవ తెలంగాణా ప్రజా పార్టీ (ఎన్‌టీపీపీ) అధినేత తూళ్ల దేగేందర్ గౌడ్ ఆరోపించారు. 1956 నుంచి తెలంగాణాపై కాంగ్రెస్ చులకనభావంతో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణాకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతాఇంతా కాదని వివరించారు. కాంగ్రెస్ పరిపాలనా కాలంలో తెలంగాణా అభివృద్థికి దూరంగా ఉందన్నారు.

తెలంగాణా రావాలని ఆకాంక్షించే నేతలు ఒక్కటయ్యే సమయం ఆసన్నమైందని చెప్పారు. తెలంగాణా కోసం పనిచేయటానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు ముందుకువస్తున్నారని వివరించారు. 15 వేల మంది కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వాన్ని పొందారని తెలిపారు. వివిధ జిల్లాల ప్రముఖ నేతలు కూడా తమ పార్టీలో చేరడానికి ముందుకువస్తున్నారని వెల్లడించారు.

తెలంగాణాలో పల్లెపల్లెకు తమ పార్టీని తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సిద్థమయ్యారని తెలిపారు. వచ్చే లోక్‍‌సభ, శాసనసభ ఎన్నికల నాటికి తెలంగాణాలోని తొమ్మిది జిల్లాల్లో తమ పార్టీని పటిష్టం చేస్తామన్నారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించి తెలంగాణా ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని గౌడ్ తెలియజేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సీఎంచే వెలిగొండ సొరంగం పనులు నేడు ప్రారంభం
విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడు
నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతు
వరంగల్ పర్యటనకు ఆగస్టు 25న సీఎం రాక
కృష్ణా జిల్లాలో వరద నష్టం అంచనా పూర్తి
కొవ్వాడ గండితో పోలవరం మండంలో వరద ముంపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...