యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సీఎంచే వెలిగొండ సొరంగం పనులు నేడు ప్రారంభం
ఒంగోలు, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 09:37 IST )
ప్రకాశం జిల్లాలో సాగు భూములకు నీటిని అందించేందుకు దోహదపడే వెలిగొండ సొరంగం పనులను ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. దోర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలో సొరంగం పనులు చేపడుతున్నారు. తొలి దశ పనుల్లో భాగంగా దాదాపు 19 కిలోమీటర్ల మేర సొరంగం తొలుస్తారు. సొరంగం తొలచటంకోసం అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన టన్నెల్ బోరర్ మెషీన్ (టీబీఎం) ను ఇక్కడకు తరలించారు.

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మంది ప్రజలకు తాగునీటిని ఈ పథకం ద్వారా అందించాలనేది ప్రభుత్వం అంచనా. కృష్ణా నది మిగులు జలాలైన 43.5 టీఎంసీల నీటిని వెలిగొండ సొరంగం ద్వారా మళ్లిస్తారు. రూ.3,470 కోట్లతో ఈ పనులను చేపట్టారు. ప్రకాశం జిల్లాలో నాలుగు కొండల మధ్య మూడు ఖాళీలను పూడ్చి జలాశయాన్ని ఏర్పాటుచేయడమే వెలిగొండ పథకం ఉద్దేశం. ఈ ఖాళీలు సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల. వెలిగొండ పథకాని మరోపేరు నల్లమల సాగర్. ఈ జలాశయంలోల 43 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.

పథకం తొలి దశ పనుల్లో భాగంగా దోర్నాల మండలం కొత్తూరు నుంచి శ్రీశైలం సమీపంలోని కొల్లం వాగు వరకూ 18.8 కిలోమీటర్ల మేర సొరంగం తొలుస్తారు. ఈ పనులు పూర్తవడానికి 30 నెలల సమయం పడుతుందని అంచనా. ఈ పథకం మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. దీనికిందగా సొరంగాన్ని ఏర్పాటుచేస్తారు. అభయారణ్యం కిందగా సొరంగం తవ్వేదానికి సుప్రీం కోర్టు నుంచి అనుమతులు రాలేదు. ఈ అనుమతులు త్వరగా రాకపోతే సొరంగం పనులు ఇక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది.

వెలిగొండ పనులను 1994లో చేపట్టిన సర్వేలో భాగంగా 11.34 మీటర్ల వ్యాసంతో సొరంగం తొలచాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2004 జులైలో ఈ సొరంగాన్ని 9.2 మీటర్ల వ్యాసంతో తొలచాలని ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. వెలిగొండ రిజర్వాయర్‌కు తోడుగా నాలుగు ఉప జలశయాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి తురిమెళ్ల, రాళ్లవాగు, గుండ్లబ్రహ్మేశ్వరం, పెద్దిరెడ్డిపల్లి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడు
నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతు
వరంగల్ పర్యటనకు ఆగస్టు 25న సీఎం రాక
కృష్ణా జిల్లాలో వరద నష్టం అంచనా పూర్తి
కొవ్వాడ గండితో పోలవరం మండంలో వరద ముంపు
బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం: రాజశేఖర రెడ్డి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...