|
| వరంగల్ పర్యటనకు ఆగస్టు 25న సీఎం రాక |
| వరంగల్, సోమవారం, 18 ఆగస్టు 2008 ( 16:11 IST ) | |
వరంగల్ జిల్లా పర్యటనకు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆగస్టు 25వ తేదీన వస్తున్నారని జిల్లా కలెక్టర్ జనార్థన రెడ్డి చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జిల్లాలో ప్రారంభించటానికి వైఎస్ వస్తున్నారని వివరించారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో చర్చలు జరిపామన్నారు. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.
సీఎం పర్యటనలోపు వేదిక వద్ద వర్షాలు పడితే సభకు వచ్చే వారికి అసౌకర్యం కలుగకుండా రెయన్‌ప్రూఫ్ పందిళ్లను వేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 17వేల మందిని ఎంపికచేశామన్నారు. 25వ తేదీన జరిగే కార్యక్రమానికి హాజరయ్యే వికలాంగులు, వృద్థులు కోసం ప్రత్యేక రవాణా వసతి ఏర్పాటుచేయడం జరిగిందని జనార్థన రెడ్డి తెలియజేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|