|
| బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం: రాజశేఖర రెడ్డి |
| హైదరాబాద్, సోమవారం, 18 ఆగస్టు 2008 ( 14:38 IST ) | |
రానున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అవిరాళ కృషి జరుపుతుందన్నారు. బీసీల కోసం అనేక పథకాలను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి అభివృద్థి కోసం భారీగా నిధులను కేటాయించిందని వివరించారు.
రాష్ట్రంలో కొత్త రాజకీయ పక్షాలు వచ్చి చేసేదేమీ లేదని కొట్టిపారేశారు. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్థి చెందిందని రాజశేఖర రెడ్డి తెలియజేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|