|
| సెప్టెంబరులో సామర్లకోటకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ |
| సామర్లకోట, సోమవారం, 18 ఆగస్టు 2008 ( 13:30 IST ) | |
సామర్లకోట సమీప ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 4వ తేదీన వస్తుందని సామర్లకోట రోటరీ క్లబ్ తెలిపింది. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో సెప్టెంబరు 4వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు ఉంటుంది. లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ 17 రోజుల పాటు సామర్లకోట ప్రాంతంలోని వారికి ఖరీదైన శస్తచికిత్సలను ఉచితంగా అందిస్తుందని సామర్లకోట రోటరీ క్లబ్ అధ్యకుడు అంబటి సుబ్రమణ్యం చెప్పారు.
లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ని ఇంపాక్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిందని వివరించారు. దేశవ్యాప్తంగా మొబైల్ వైద్య సేవలను అందించేందుకు ఈ రైలును ఏర్పాటుచేశారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేదీ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సామర్లకోట సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. సామర్లకోట ప్రాంత వాసులకు వివిధ రకాల శస్త్ర చికిత్సలను ఉచితంగా లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌లో చేస్తారని సుబ్రమణ్యం తెలియజేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|