|
| గ్రామీణ విద్యుదీకరణ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష |
| హైదరాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008 ( 16:54 IST ) | |
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం వివరాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ విలేకరులకు వెల్లడించారు. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.814 కోట్ల నిధులు కేటాయించామని షబ్బీర్ అలీ తెలిపారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు 14 లక్షల మందికి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఈ పథకం కింద 125 రూపాయలకే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తున్నామని, ఈ ఏడాది మరో 12 లక్షల మందికి కొత్త కనెక్షన్లు మంజూరు చేయనున్నామని రాష్ట్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే వర్షాలు బాగానే కురుస్తున్నప్పటికీ రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంకొంత సమయం పడుతుందన్నారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి వెంటనే ప్రారంభించడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయం విడుదలవున్న నీరు ఇప్పటిలాగే కొనసాగితే మరో వారం రోజుల తరువాత ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యపడుతుందని షబ్బీర్ అలీ వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|