|
| రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేత |
| కడప, గురువారం, 7 ఆగస్టు 2008 ( 16:39 IST ) | |
రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో గురువారం రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారణంగా బొగ్గు తడిసిపోవడంతో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మొత్తం నాలుగు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి.
ప్రస్తుతం వీటిలో రెండు మాత్రమే పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్ రోజుకు 210 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగివుంది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వార్త మరింత ఇబ్బంది కలిగించేదే. ఈ విద్యుత్ కేంద్రంలో మొత్తం 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|