|
| ఆరోగ్యశ్రీ పథకం: ప్రతిపక్షాలకు బురదచల్లొద్దని విజ్ఞప్తి |
| హైదరాబాద్, 7 ఆగస్టు 2008 ( 14:09 IST ) | |
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంపై బురదచల్లే పద్దతిని మానుకోవాలని రాష్ట్ర మంత్రి రోశయ్య ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విద్య, వైద్య రంగాలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రంగాలపై శ్రద్ధ తీసుకుంటుందని రోశయ్య విమర్శించారు.
బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు రోశయ్య, గల్లా అరుణకుమారి, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరాలు ఆరోగ్యశ్రీపై బురుదచల్లుతున్న ప్రతిపక్షలపై ధ్వజమెత్తారు. ఈ పథకంపై విమర్శలు మంచి పద్దతి కాదని హితువు పలికారు. కర్ణాటక రాష్ట్రంలో చేపట్టిన "యశస్విని" పథకం స్పూర్తితో ప్రభుత్వం రాష్ట్రంలోనూ ఆరోగ్యశ్రీని ప్రారంభించిందని వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|