యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రంలో భారీ వర్షాలు: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
హైదరాబాద్, 7 ఆగస్టు 2008   ( 13:52 IST )
రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాలు జలమయం అయ్యాయి.

బుధవారం రాత్రి ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికావడంతో అక్కడి ప్రజలను అధికారిక యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

బుధవారం ఉదయం నుంచి గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. రాత్రి సమయానికి ప్రమాద స్థాయికి చేరుకుంది. గోదావరి నది వరద నీటికి పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. కొన్ని గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించే అవకాశం ఉండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వైఎస్ సొంతమనిషికి ఆరోగ్యశ్రీ భీమా నిధులు ధారాదత్తం
ముఖ్యమంత్రికి మద్యం అమ్మకాల్లో కమీషన్: బాబు
లౌకికవాద పార్టీలతో ఈ నెల 10న లెఫ్ట్ సమావేశం
మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ప్రకటన
మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు కూడా సహకరించాలి: శర్మ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...