|
| వైఎస్ సొంతమనిషికి ఆరోగ్యశ్రీ భీమా నిధులు ధారాదత్తం |
| కర్నూలు, గురువారం, 7 ఆగస్టు 2008 ( 10:09 IST ) | |
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి సొంత మనిషికి చెందిన భీమా కంపెనీకి ధారదత్తం చేశారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై అసెంబ్లీ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను బాబు స్వాగతించారు. అసెంబ్లీలోనే దీనిపై చర్చ జరుపుదామన్నారు.
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన నిధులను అప్పగించేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఒక్క భీమా సంస్థే కనిపించడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన దోపిడీలు జరుగుతున్నాయని, అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నివస్తువుల ధరలు పెరిగినప్పటికీ, రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని చంద్రబాబు విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|