|
| ముఖ్యమంత్రికి మద్యం అమ్మకాల్లో కమీషన్: బాబు |
| కర్నూలు, గురువారం, 7 ఆగస్టు 2008 ( 10:02 IST ) | |
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికు ముడుపులు అందుతున్నాయని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆరోపించారు. ప్రతి బాటిల్ అమ్మకంపై ముఖ్యమంత్రికి రూ.5 కమీషన్ అందుతోందని ఆయన ఆరోపించారు. మద్యం తాగి రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యం పాడు చేసుకుంటుండగా, ముఖ్యమంత్రి మాత్రం ముడుపులు స్వీకరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసిన బెల్టు షాపులు పెట్టించి జనం చేత మద్యం తాగిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దు చేస్తుందని చంద్రబాబు కర్నూలు జిల్లా మీకోసం యాత్రలో హామీ ఇచ్చారు. ఆయన మీకోసం యాత్ర బుధవారం జిల్లాలోని కోవెలకుంట్ల, సంజామల ప్రాంతాల్లో జరిగింది. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకంపై కూడా నిప్పులు చెరిగారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|