|
| లౌకికవాద పార్టీలతో ఈ నెల 10న లెఫ్ట్ సమావేశం |
| హైదరాబాద్, 7 ఆగస్టు 2008 ( 09:54 IST ) | |
రాష్ట్రంలోని లౌకికవాద పార్టీలన్నింటితో ఈ నెల 10న లెఫ్ట్ పార్టీలు సమావేశం కాబోతున్నాయి. ఉమ్మడి పోరాటాల కోసం బీజేపీ మినహా మిగిలిన విపక్షాలతో చేతులు కలపాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. విపక్షాలను చర్చలకు ఆహ్వానించేందుకు సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ నేత రామనరసింహారావులతో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశాయి.
ఈ నెల 10న జరిగే చర్చల్లో పరిస్థితులను గమనించి, వారితో దోస్తీని భవిష్యత్‌లో కొనసాగించాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున, ప్రస్తుతం పొత్తుల అంశాన్ని పక్కనబెట్టి ఉమ్మడి ఉద్యమాలకు కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్లాలని నిర్ణయించామని వెల్లడించాయి.
సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు బీవీ రాఘవులు, నారాయణ బుధవారం జరిపిన చర్చల్లో ఈ విధానాన్ని ఖరారు చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి కూడా సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు చర్చలు జరిపారు. ఈ నెల 20న ప్రభుత్వోద్యోగులు నిర్వహించ తలపెట్టిన దేశవాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|