|
| మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష |
| హైదరాబాద్, బుధవారం, 6 ఆగస్టు 2008 ( 16:53 IST ) | |
ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడంపై ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ రాజధానిలోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఉపాధ్యాయుల ఆమరణ నిరాహార దీక్షకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి బుధవారం నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలనే నిర్ణయానికి నిరసనగా నిరవధిక సమ్మెకు కూడా దిగాలని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటీసును ప్రభుత్వానికి అందజేస్తామని పరిరక్షణ కమిటీ తెలిపింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|