|
| విజయవాడ పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు |
| విజయవాడ, బుధవారం, 6 ఆగస్టు 2008 ( 16:28 IST ) | |
విజయవాడ పాతబస్తీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాతబస్తీలోని వించిపేటలో బుధవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. ఒక ప్రేమ వివాహం కారణంగా బుధవారం రాత్రి వించిపేటలో ఇరువర్గాల మధ్య దాడులు జరిగిన సంగతి తెలిసిందే. పరస్పర దాడులు, ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల జోక్యంతో గతరాత్రి పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, బుధవారం మళ్లీ ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒక సామాజికవర్గానికి చెందిన అబ్బాయి మతాంతర వివాహం చేసుకోవడం వివాదాస్పదమైంది. అమ్మాయి, అబ్బాయి తరుపువారి మధ్య ప్రారంభమైన ఘర్షణలు వించిపేటను బుధవారం కూడా కుదిపేశాయి. రాత్రి ఘర్షణలు జరిగిన అనంతరం పోలీసులు ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
స్కూళ్లు, దుకాణాలు మూసివేసి పరిస్థితి ప్రశాంతంగా ఉన్న తరుణంలో, బుధవారం మధ్యాహ్నం ఇరువర్గాల వారు మళ్లీ ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారు. రోడ్లపైకి వచ్చి రాళ్లు విసురుకోవడంతోపాటు, కత్తులతో దాడులు చేసుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆందోళనకారులు వారిపైకి కూడా రాళ్లు విసిరారు. ఆందోళనకారుల దాడుల్లో పోలీసులు కూడా గాయపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|