యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
విప్ ధిక్కరణ : టీడీపీ నుంచి ఆదికేశవులు ఔట్
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 15:57 IST )
చిత్తూరు ఎంపీ ఆదికేశవులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. గత మంగళవారం లోక్‌సభలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు పార్టీ ఆయనపై ఈ చర్య తీసుకుంది.

నల్గొండలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా సహించేది లేదని స్పష్టం చేశారు.

గత మంగళవారం లోక్‌సభలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంద జగన్నాథం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేశారు. దీంతో టీడీపీ నుంచి జగన్నాథంకు ఉద్వాసన పలికారు. అలాగే బలపరీక్ష సమయంలో ఆదికేశవులు సైతం టీడీపీకి వ్యతిరేకంగా యూపీఏకే ఓటు వేశారనే వార్తలు వెలువడ్డాయి.

కానీ ఆదికేశవులు మాత్రం తాను ఆ పని చేయలేదని పొలిట్‌బ్యూరో ముందు చెప్పడంతో ఆయనపై వేటు వేసే విషయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆదికేశవులుపై విచారణ జరిపిన టీడీపీ పొలిట్‌బ్యూరో శుక్రవారం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధికారికంగా ప్రకటించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విశ్వాసం కోసం కాంగ్రెస్ అడ్డదారులు : టీడీపీ విమర్శ
అనుకూలమైన వారితో పొత్తుకు సై : దేవేందర్
గ్రామీణ పారిశుద్ధ్యానికి చర్యలు : పిన్నమనేని
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో టీడీపీచే ఆందోళన
గడువులోపు మెడిక్లెయిమ్‌‌ దరఖాస్తు: జర్నలిస్ట్స్ యూనియన్
ఆగస్టు 1 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం: ఎన్నికల కమిషన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...