|
| అనుకూలమైన వారితో పొత్తుకు సై : దేవేందర్ |
| మహబూబ్‌నగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 13:35 IST ) | |
తెలంగాణపై స్పష్టమైన హామీ వెలువరించే పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు నవ తెలంగాణా ప్రజా పార్టీ అధినేత దేవేందర్‌గౌడ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తాము పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు ఆయన తెలిపారు.
మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా గురువారం జడ్చర్ల మండలం పోలేపల్లిలో దేవేందర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం కోసమే తాము ఉద్యమిస్తున్నామన్నారు. ఈ విషయంలో కలిసివచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధమేనన్నారు.
అయితే తమ పార్టీ ఆవిర్భవించి నెలరోజులు మాత్రమే అయిన కారణంగా జిల్లాల్లో పార్టీని పటిష్టపరిచే దిశగా ముందుకు సాగుతున్నట్టు ఆయన తెలిపారు. పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయాన్ని ఆలోచించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన టీడీపీపై విమర్శలు చేశారు. ఎంపీ మంద జగన్నాథం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీలో స్వేచ్ఛలేదనడానికి జగన్నాథం సంఘటన మరో ఉదాహరణ అని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|