|
| మాయావతి ప్రధాని అభ్యర్థిత్వంపై మారెప్ప విసుర్లు |
| హైదరాబాద్, గురువారం, 24 జులై 2008 ( 13:19 IST ) | |
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప తీవ్రంగా విమర్శించారు. మాయావతి ప్రధాని పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండటంపై మారప్ప తీవ్రంగా మండిపడ్డారు. మాయావతి ప్రధానైతే దేశం ముక్కలైపోతుందన్నారు.
విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించడం పట్ల బుధవారం ముఖ్యమంత్రిని కలసుకొని మారెప్ప అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాయావతిని ప్రధాని పదవికి ప్రతిపాదించిన కేసీఆర్‌కు ఈ విశ్వాసపరీక్ష గుణపాఠం నేర్పిందన్నారు.
ఇదిలా ఉంటే మారెప్ప ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కూడా ఈ సందర్భంగా విమర్శించారు. విశ్వాసపరీక్ష కోసం బాబు న్యూఢిల్లీ వెళ్లి మంచి పని చేశారన్నారు. ఆయన రాష్ట్రం వదిలి వెళ్లడం వలన ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|