|
| లెఫ్ట్ పార్టీలకు మళ్లీ కాంగ్రెస్సే దిక్కు: డి. శ్రీనివాస్ |
| తిరుపతి, గురువారం, 24 జులై 2008 ( 11:51 IST ) | |
ఏ దిక్కులేని లెఫ్ట్ పార్టీలకు మళ్లీ కాంగ్రెస్ పార్టీయే దిక్కు అని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం మినహా లెఫ్ట్‌కు మరో మార్గంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. లెఫ్ట్ పార్టీలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేవన్నారు.
వామపక్షాలు బీజేపీతో జట్టుకట్టలేని సంగతి తెలిసిందే. ఇక మిగిలిన యూఎన్‌పీఏ పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. ఎస్పీ అధినేత ములాయం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెరోవైపు వెళ్లి యూఎన్‌పీఏను చిన్నాభిన్నం చేశారు.
ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్సే మళ్లీ దిక్కు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ నెల 22న జరిగిన విశ్వాసపరీక్షలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు యూపీఏకు అనుకూలంగా ఓటు వేయడాన్ని డి.శ్రీనివాస్ ఈ సందర్భంగా సమర్థించారు. దేశ హితాన్ని కోరి వారు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|