యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
యూపీఏని పతనం చేసేందుకే ఏకం అయ్యాం: బాబు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 20 జులై 2008   ( 18:04 IST )
అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తమ పార్టీలన్నీ ఏకమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లెఫ్ట్, బీఎస్పీ నేతలతో సమావేశం కోసం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

ఆదివారం లెఫ్ట్, యూఎన్‌పీఏ, బీఎస్పీ అగ్రనేతలతో సమావేశం అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 22న లోక్‌సభలో జరిగే విశ్వాసపరీక్షలో యూపీఏ కూటమి ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని బాబు ఈ సందర్భంగా చెప్పారు.

ఈ విశ్వాసపరీక్ష ఫలితాన్ని బట్టి తమ భవిష్యత్‌ ప్రణాళికను తయారు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఆదివారం జరిగిన యూఎన్‌పీఏ సమావేశానికి కూటమిలోని వివిధ పార్టీల నేతలు హాజరైనట్టు చెప్పారు. ప్రస్తుతం తమ ముందున్న ఒకేఒక్క లక్ష్యం యూపీఏ ప్రభుత్వాన్ని కూల్చివేయడమేనని బాబు పేర్కొన్నారు.

యూపీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తూ మహాకూటమి ఆవిర్భావం జరుగుతుందని వచ్చిన ఊహాగానాలను చంద్రబాబు కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ జోస్యం
యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేస్తా: ఓవైసీ నిర్ణయం
తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
సోనియాతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం
విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన
ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గం: వెంకయ్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...