యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ జోస్యం
నెల్లూరు (ఏజెన్సీ), 20 జులై 2008   ( 17:29 IST )
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో కూలిపోతుందని ప్రతిపక్ష బీజేపీ జోస్యం చెప్పింది. యూపీఏ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆయన ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ విశ్వాసపరీక్షలో యూపీఏ కూలిపోతుందన్నారు. ఒకవేళ ఇందులో గట్టెక్కినా లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పారు.

యూపీఏ కూలిపోయిన పక్షంలో కేంద్రంలో తమ పార్టీ నేతృత్వంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకాదని చెప్పారు. తమ పార్టీ కొత్తగా మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించదని, అందుకు బదులుగా ప్రజా తీర్పును కోరతామని చెప్పారు. యూపీఏ కూటమి ప్రభుత్వం తన నాలుగేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అణు ఒప్పందంపై దుమారాన్ని సృష్టించిందన్నారు.

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, వీటిపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. మరో ఆరు నెలల్లో అమెరికాలో జార్జి బుష్, ఇక్కడ యూపీఏ ప్రభుత్వాల కాలం ముగియనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అణు ఒప్పందం కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదని వెంకయ్య నాయడు విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేస్తా: ఓవైసీ నిర్ణయం
తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
సోనియాతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం
విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన
ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గం: వెంకయ్య
సీపీఐకి తాడి శకుంతల గుడ్‌బై
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...