|
| యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేస్తా: ఓవైసీ నిర్ణయం |
| హైదరాబాద్ (ఏజెన్సీ), 20 జులై 2008 ( 17:17 IST ) | |
లోక్‌సభలో ఈనెల 22వ తేదీన జరగబోతున్న బలపరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. ఎంఐఎంకు చెందిన ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఓవైసీ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు తాను ఓటు వేయనున్నట్టు తెలిపారు.
ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారని ఓవైసీ చెప్పారు.
అందువలనే యూపీఏకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ముస్లింలకు వ్యతిరేకమైందనే వాదనల నేపథ్యంలో ఓవైసీ యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ఉహాగానాలు వినిపించాయి. అయితే యూపీఏ ద్వారా ముస్లింలకు లబ్ది చేకూరుతుందనే విశ్వాసంతో ఓవైసీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|