|
| రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 10:55 IST ) | |
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. రాష్ట్రంలో ఇకపై రాత్రిపూట కరెంటు కోతలుండవని ఆయన వెల్లడించారు.
శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ నిర్వహించిన సమీక్ష సమీవేశంలో పాల్గొన్న షబ్బీర్ అలీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాత్రి పూట కరెంటు కోతలు వద్దని తాము ఆదేశించినా కొన్ని డిస్కమ్‌ల పరిధిలో అవి అమలు కాలేదని ఆయన తెలిపారు. గురువారం కేంద్రం నుంచి 50 మెగావాట్ల విద్యుత్ అందిందని చెప్పారు.
అలాగే ప్రైవేటు సంస్థల నుంచి మరో 150 మెగావాట్ల విద్యుత్‌ను సేకరించినట్టు తెలిపారు. నాఫ్తా పవర్ ప్రాజెక్టు 24 గంటలూ నడిచే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దీనితో రాష్ట్రానికి మరో 200 మెగావాట్ల విద్యుత్ లభించనుందని వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|