|
| బాబు పార్టీని భ్రష్టు పట్టించారు: సి.రామచంద్రయ్య |
| కడప (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 09:39 IST ) | |
చంద్రబాబు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని టీడీపీ పార్టీకీ రాజీనామా చేసిన సి.రామచంద్రయ్య తెలిపారు. ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటయిన పార్టీని తమ స్వంత రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
రాజీనామా ప్రకటించే ముందు ఆయన కోడూరు నుంచి కడప వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కడపలోని ఓ కల్యాణమండపంలో విలేకరులతో మాట్లాడారు. బాబు వైఖరి మార్చేందుకు తాను ఎంతో ప్రయత్నించానని అన్నారు. అయినా మార్పు రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశానని తెలిపారు.
తెలంగాణ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ వైఫల్యతను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించినా ఆయన పట్టించుకోలేదని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|