|
| అణు ఒప్పందంతో యూపీఏ పతనం: సురవరం |
| హైదరాబాద్, శుక్రవారం, 18 జులై 2008 ( 16:06 IST ) | |
భారత్- అమెరికా అణు ఒప్పందం విషయంలో యూపీఏ పతనం కావడం ఖాయమని సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో దేశభద్రతకు విఘాతం ఏర్పడగలదని చెప్పారు.
హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఒప్పందంపై తమ వైఖరిని సోనియా తప్పుబట్టడాన్ని ఖండించారు. దేశాన్ని నాశనం చేసేదిగా ఉన్నందునే ఈ ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
విశ్వాసపరీక్షలో నెగ్గేందుకోసం యూపీఏ సర్కారు పెద్ద ఎత్తున బేరసారాలు చేస్తున్నా ఓడిపోక తప్పదన్నారు. అక్టోబర్ నాటికల్లా లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రాగలవని ఆయన ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|