|
| కర్నూలు జిల్లాలో కంది పప్పు అక్రమ నిల్వల పట్టివేత |
| కర్నూలు, శుక్రవారం, 18 జులై 2008 ( 15:38 IST ) | |
కర్నూలు జిల్లాలో అక్రమంగా నిల్వఉంచిన రూ.350కోట్ల విలువ చేసే కందిపప్పును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని 58 గోదాములపై దాడులు జరిపిన సందర్భంగా ఈ కందిపప్పు అక్రమ నిల్వలు వెలుగు చూశాయని వెల్లడించారు.
నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కేజీ కందిపప్పును రూ. 35లకే అందించేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తగినంత కందిపప్పు నిల్వలేదని కారణంగా చెబుతూ డీలర్లు వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న సంగతి వెలుగుచూసింది.
దీంతో వివిధ వర్గాల నుంచి అందిన సమాచారంతో అధికారులు ఈ గోదాములపై దాడులు జరిపారు. ఈ సందర్భంగా కొందరు డీలర్లను అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారయ్యారు. ఈ అవకతవకలు బయటపడటంతో ఇక ఈ దాడులను నిరంతరం కొనసాగించాలని విజిలెన్స్ శాఖ అధికారులు నిర్ణయించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|