|
| అణు ఒప్పందం స్వార్థ రాజకీయాల కోసమే: రాఘవులు |
| హైదరాబాద్, శుక్రవారం, 18 జులై 2008 ( 15:02 IST ) | |
అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకు ఉద్ధేశించిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. అణు విద్యుత్ తయారు చేసినా, దాని ఉత్పత్తి వ్యయం భారీగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
బషీర్‌బాగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందంతో రూ.4లక్షల కోట్లు వెచ్చించి, నలభై వేల మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయడం కన్నా దేశంలో విరివిగా లభించే బొగ్గు వనరులతో లక్ష మెగావాట్లను అతిత్వరగా ఉత్పత్తి చేయొచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ ఒప్పందం ద్వారా అమెరికా అణు విద్యుత్ కర్మాగారాలు నెలకొల్పి, దేశ ప్రజలను మోసం చేయగలదన్నారు. దేశానికి భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్ కొరతను ఈ అణు ఒప్పందం పరిష్కరించగలదని సోనియా చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|