|
| తెరాసతో చేతులు కలిపేందుకు రెడీ: ఎర్రన్నాయుడు |
| హైదరాబాద్, శుక్రవారం, 18 జులై 2008 ( 11:12 IST ) | |
అణు ఒప్పందాన్ని వ్యతిరేకించే విషయంలో తెరాసతో చేతులు కలిపేందుకు తమ పార్టీ సిద్ధంగానే ఉందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రన్నాయుడు ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య శతృత్వం లేదని, సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే టీడీపీతో పొత్తుకు తాము సుముఖంగానే ఉన్నట్టు కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతించారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు.
అయితే ఆ పార్టీతో పొత్తు, మూడో ఫ్రంట్‌లో ఆ పార్టీ స్థానంపై తమ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీల మధ్య విభేదాలున్నా యూపీఏ ప్రభుత్వాన్ని ఓడించడమనే తమ ప్రధానోద్ధేశ్యమన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|