|
| కడపలో బస్సు. క్వాలిస్ ఢీ: 11 మంది మృతి |
| రాజంపేట (ఏజెన్సీ), 19 మే 2008 ( 10:10 IST ) | |
కడప జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించాయి. కడపలోని ఓబులవారిపల్లి మండలం రెడ్డిపల్లి చెరువుకట్టపై ఈ ప్రమాదం సంభవించిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
తిరుపతి నుంచి వస్తున్ ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టరును ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న క్వాలిస్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్వాలిస్‌లో ఉన్న మహారాష్ట్రకు చెందిన 15 మంది ప్రయాణీకుల్లో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారని అధికార వర్గాలు తెలిపాయి.
గాయాలైన వారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారని అధికార వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో ఐదురుగు చిన్నారులు కూడా ఉన్నారని సంఘటనా స్థలాన్ని సందర్శించిన రాజంపేట డీఎస్పీ కృష్ణకుమార్ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|