|
| కేసీఆర్, వైఎస్ ఇద్దరినీ ప్రజలు క్షమించరు: చంద్రబాబు
|
| హైదరాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 14:07 IST ) | |
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక రాయలసీమ వాదాన్ని వినిపించిన వైఎస్‌ఆర్, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశాడని చంద్రబాబు ఆరోపించారు.
రాజకీయ ఉనికి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వైఎస్‌కు వెన్నతో వెట్టిన విద్య అని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్‌ది కూడా ఇదేతరహా వ్యవహారశైలి అని చంద్రబాబు పేర్కొన్నారు. వీరిద్దరినీ తెలంగాణ ప్రజలు క్షమించబోరని ధ్వజమెత్తారు.
మీకోసం రథయాత్రలో భాగంగా ఆయన శనివారం కరీంనగర్ జిల్లాలో ఉపఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్, వైఎస్‌ఆర్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. వీరిద్దరూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజల జీవితాలతో ఇద్దరు నేతలు ఆడుకుంటున్నారన్నారు. వీరిద్దరికీ తగిన శాస్తి చేయాలని బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సొంతపార్టీ కాపాడుకోలేని కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమం ఎందుకని బాబు ప్రశ్నించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|