యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రైతు చైతన్య యాత్రలకు ఎన్నికల సంఘం అనుమతి
హైదరాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008   ( 13:51 IST )
త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న జిల్లాల్లో రైతు చైతన్య యాత్రలు చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు వెల్లడించారు.

ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రైతు చైతన్య యాత్రలకు సంబంధించిన అనుమతులు వచ్చాయని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో షరతులకు లోబడి రైతు చైతన్య యాత్రలు, రైతు సదస్సులు నిర్వహించవచ్చని తెలిపారు.

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఇవి పూర్తి అధికారిక కార్యక్రమాల్లో జరగాలని ఎన్నికల సంఘం షరతు విధించినట్టు ఐవీ సుబ్బారావు తెలిపారు. రైతు చైతన్య యాత్రలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విశాఖలో రూ. 1575కోట్లతో 15 భారీ ప్రాజెక్టులుః వైఎస్
వరద బాధిత రైతులకోసం రూ. 167 కోట్ల పరిహారం
శంషాబాద్‌లో రెండున్నర కేజీల హెరాయిన్ స్వాధీనం
ఐసెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జర్మనీ సహకారంతో తిరుపతికి కొంగొత్త అందాలు
కేసీఆర్‌కు ఇక పరాజయాల బాటేః జీవన్ రెడ్డి జోస్యం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace