|
| మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థలంలో భూపోరాటం |
| శుక్రవారం, 9 మే 2008 ( 15:03 IST ) | |
రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సొంతమైన స్థలంలో సీపీఎం కార్యకర్తలు శుక్రవారం భూపోరాటానికి దిగారు. శ్రీకాకుళం పట్టణంలో ఆయనకు సొంతమైన స్థలంలో ఎర్రజెండాలు పాతడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ స్థలాన్ని మంత్రి ధర్మాన అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. వెంటనే ఆ స్థలాన్ని పేదలకు ఇస్తున్నట్టు ప్రకటించి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మానకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|