|
| సినీ పరిశ్రమపై వ్యాఖ్యలకు చంద్రమోహన్ క్షమాపణలు |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 14:31 IST ) | |
సినీ పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకై నటుడు చంద్రమోహన్ క్షమాపణలు చెప్పారు. గోల్డ్ క్వెస్ట్ వ్యవహారంలో తన పేరును ఇరికించినందుకై సినీ పరిశ్రమలోనూ మోసగాళ్లున్నారని ఆవేశంలో మాట్లాడానని వివరణ ఇచ్చారు.
ఆయన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు తన వివరణతో లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. తన సినీ జీవితంలో ఎన్నడూ ఇలా వివాదాల్లో చిక్కుకోలేదని చెప్పారు. అయినా గోల్డ్‌క్వెస్ట్ మంచి సంస్థేనన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|