|
| తెలంగాణా కమ్యూనిస్టు యోధుడు భీంరెడ్డి అస్తమయం |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 13:04 IST ) | |
తెలంగాణాలో జరిగిన పలు పోరాటాలలో కీలకపాత్ర పోషించిన ఎంసీపీఐ నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.
నల్గొండ జిల్లా, కొత్తగూడెంలో 1925లో జన్మించిన ఆయన 1940లో సీపీఎంలో చేరి, పలు పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా నిజాం వ్యతిరేక పోరాటం, వెట్టి చాకిరీ వ్యతిరేక పోరాటాలలో ఆయనకు ప్రశంసనీయమైన స్థానం ఉంది.
మిర్యాలగూడ ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 1996లో ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎంసీపీఐలో చేరారు. ఉపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|