|
| నిరుద్యోగ రహత జిల్లాగా నెల్లూరుః వైఎస్ హామీ |
| నాయుడుపేట (ఏజెన్సీ), 9 మే 2008 ( 10:31 IST ) | |
నెల్లూరు జిల్లాను నిరుద్యోగ రహిత జిల్లాగా చేయనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు. జిల్లాలో రూ. 23 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానుండటంతో జిల్లా ముఖచిత్రం మారిపోగలదన్నారు.
నాయుడుపేట మండలం, మేనకూరు వద్ద సుమారు రెండు వేల ఎకరాలలో లార్డ్ స్వరాజ్ పాల్ గ్రూపు ఏర్పాటు చేయనున్న కపారో ఇండస్ట్రియల్ పార్కుకు గురువారం భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఏడాదికి వెయ్యి లగ్జరీ బస్సుల ప్రాథమిక ఉత్పత్తి సామర్థ్యంతో రూ. 3500వేల కోట్లతో పరిశ్రమలు ఈ పార్కులో ఏర్పాటు కానుందన్నారు.
ఇది కాక కృష్ణపట్నం వద్ద మరో ప్రత్యేక ఆర్థిక మండలిని, మేనకూరు వద్ద తైవాన్ సంస్థ ఓ పరిశ్రమను ఏర్పాటు చేయనుందని తెలిపారు. దీంతో జిల్లాలో నిరుద్యోగ సమస్య పూర్తిగా అంతరించిపోగలదన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|