|
| అక్టోబర్ నుంటి ఆరోగ్యశ్రీ అమలుకు ఏర్పాట్లు |
| సికింద్రాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 16:15 IST ) | |
జంట నగరాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అక్టోబర్ నుంచి అమలులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తెల్లకార్డు కలిగిన వారికి ఉచితంగా వైద్యసేవలను అందించనున్నట్టు సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జి, మంత్రి సంభాని చంద్రశేఖర్ తెలిపారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బుధవారం నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి ఈ మేరకు ప్రకటించారు. అలాగే తెల్ల కార్డు కలిగిన వారికి వార్షిక ఆదాయం రూ. 20 వేల నుంచి రూ. 60 వేలకు పెంచే ప్రతిపాదన కూడా దాదాపు ఖరారు అయినట్టే అని అన్నారు.
అధికారంలోకి వచ్చేందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్, ముషీరాబాద్ స్థానాల్లో తెరాసతో పొత్తు పెట్టుకుందని అన్నారు. అయితే తెరాసతో ప్రజలకు జరిగిన మంచి ఏదీ లేదని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|