|
| అంగరంగ వైభవంగా నరసింహస్వామి చందనోత్సవం |
| విశాఖపట్నం (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 14:29 IST ) | |
విశాఖ జిల్లాలోని సింహాచలంలోని శ్రీ వరాహ నరసింహస్వామి వారి పవిత్ర పుణ్యక్షేత్రంలో చందనోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచే కాకుండా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఈ ఉత్సవంలో భాగంగా మొదట స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, ఆ తర్వాత వేద మంత్రాలతో స్వామి వారి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించారు. వెండి కలశాలలో నింపిన గంగాజలంతో స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని సకలాభరణాలతో అలంకరించారు.
స్వామి వారి ఎదపై, శిరస్సుపై పచ్చి చందనాన్ని అలంకరించి దర్శనానికి భక్తులను అనుమతించినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. చందనోత్సవ గంధాన్ని గృహంలో ఉంచడం ద్వారా ఆ ఇంట్లో సుఖ, సంతోషాలతో పాటు ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే దీనిని నీటిలో కలిపి త్రాగడం ద్వారా సకల వ్యాధులు నయమవుతాయని భక్తులు భావిస్తారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|